Thursday, April 18, 2024

ద‌స‌రా ట్రైల‌ర్ కి 12 మిలియన్ ప్లస్ వ్యూస్ .. 400 K లైక్స్

ద‌స‌రా చిత్రం ట్రైల‌ర్ కి వూహించని స్పంద‌న వ‌స్తోంది.ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేశారు.హీరో నానీతో పాటు హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా డిఫరెంట్ లుక్ తోనే కనిపించింది. ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. అందువలన టీజర్ నుంచి ప్రతి అప్ డేట్ ను ఐదు భాషల్లో ఒకే సమయంలో వదులుతూ వస్తున్నారు. అలాగే నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇలా ట్రైలర్ ను వదిలారో లేదో, అలా రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఐదు భాషల్లో కలుపుకుని ఈ ట్రైలర్ 12 మిలియన్ ప్లస్ వ్యూస్ ను .. 400 K లైక్స్ ను రాబట్టుకుంది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ‘నేను లోకల్’ తరువాత నాని – కీర్తి సురేశ్ కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. బొగ్గుగనుల నేపథ్యంలో పుట్టిపెరిగిన ఒక మాస్ యువకుడి కథ ఇది. తమ బతుకులపై ఆధిపత్యానికి ప్రయత్నించినవారిని ఆ యువకుడు ఎదిరించిన తీరే ఈ కథ.

Advertisement

తాజా వార్తలు

Advertisement