Thursday, April 25, 2024

ద‌స‌రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్క‌డంటే

ద‌స‌రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల.. ఈ సినిమాలో హీరోగా నాని..హీరోయిన్ గా కీర్తి సురేశ్ న‌టిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి డేట్ ను .. వేదికను ఖరారు చేశారు. అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ కథ అంతా కూడా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో నడుస్తుంది. ఈ కథలో ఉన్న ఒక కామన్ పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందనీ, అందువల్లనే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఇప్పటికే పాటల పరంగా మంచి మార్కులు కొట్టేసింది.ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది.సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement