Thursday, March 28, 2024

స్లో ఓవర్‌ రేటు… ఫీజులో 80శాతం కోత

బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్‌ రేటు కారణంగా భారత జట్టు మ్యాచ్‌ ఫీజులో ఏకంగా 80శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా షెడ్యూల్‌ సమయానికి ఓవర్లు పూర్తి చేయలేకపోతే 20శాతం మ్యాచ్‌ ఫీజుని పెనాల్టిdని విధిస్తారు. అయితే తొలి వన్డేలో టీమిండియా ఓవర్‌ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో తక్కువ వేసిన ఒక్కో ఓవర్‌కు 20శాతం లెక్కన 80శాతం మ్యాచ్‌ ఫీజును ఐసీసీ కోత విధించింది. స్లో ఓవర్‌ రేటు వేసినందుకు రిఫరీకి క్షమాపణలు చెప్పిన రోహిత్‌ శర్మ, మ్యాచ్‌ ఫీజు కోతకి అంగీకరించారు.

ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఆర్టికల్‌ నిబంధన ప్రకారం స్లో ఓవర్‌ రేటు చేసిన జట్టు ప్లేయర్లకు, సపోర్టింగ్‌ స్టాప్‌కి, అలాగే జట్టుతో సంబంధం ఉన్న ఇతర సిబ్బందికి ఒక్కో ఓవర్‌కి 20శాతం మ్యాచ్‌ ఫీజు కోత విధించడం జరుగుతుంది. మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ మదుగల్లే, టీమిండియా నెట్‌ ఓవర్‌ రేటుకి ఏకంగా 4 ఓవర్లు తక్కువగా వేసినట్టు గుర్తించారు అని ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement