Wednesday, April 24, 2024

తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిపోయిన రాకపోకలు

తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో అన్ని జిల్లాలలో అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. కుండపోత వర్షాల నేపథ్యంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే తెలంగాణ రాష్ట్రంతో పాటు మహరాష్ట్రలోనూ విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి ఉగ్ర రూపంగా ప్రవహిస్తోంది.

ముఖ్యంగా కందకుర్తి బ్రిడ్జిపై నుంచి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా నీటి ప్రవాహం ఉండటంతో ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచి పోయాయి. ఇక అటు మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఈ భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement