Thursday, April 25, 2024

ధమాకా మూవీ నుండి డు..డు సాంగ్ ప్రోమో.. నవంబర్ 25న ఫుల్ సాంగ్

ధమాకా చిత్రం నుండి డు..డు అనే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు ఈ చిత్ర మేకర్స్. కాగా ఈ మూవీని దర్శకుడు త్రినాథరావు నక్కిన రూపొందిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా రవితేజ …హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి డు..డు అంటూ సాగే ప్రోమో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ ఫుల్‌ సాంగ్‌ ను నవంబర్ 25న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

YouTube video

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement