Saturday, April 20, 2024

మోహ‌న్ లాల్ కి సంకెళ్లు-దృశ్యం3 పోస్ట‌ర్

మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా క‌థ‌లు త‌యారు చేస్తుంటాడు. తక్కువ బడ్జెట్ లో .. తక్కువ రోజుల్లో తెరపైకి సినిమాల‌ని తీసుకుని వస్తుండటం విశేషం. కాగా దృశ్యం చిత్రానికి కొన‌సాగింపుగా దృశ్యం2..ఇప్పుడు దృశ్యం3 తెర‌కెక్కుతోంది. మోహన్ లాల్ హీరోగా నటించిన దృశ్యం .. దృశ్యం 2 సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. తెలుగుతో పాటు రీమేక్ అయిన ఇతర భాషల్లోను ఈ సినిమాలకి విశేషమైన ఆదరణ లభించింది. ఫస్ట్ పార్టుకి మించి సెకండు పార్టుకి రెస్పాన్స్ రావడం విశేషం. ఈ నేపథ్యంలో జీతూ జోసెఫ్ ఈ సినిమా 3వ భాగాన్ని సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మోహన్ లాల్ పోస్టర్ ను వదిలారు. మోహన్ లాల్ కి సంకెళ్లు వేసి ఉండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సిరీస్ ఈ సినిమాతో ముగుస్తుందని జీతూ చెప్పడంతో, ముగింపు పట్ల అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement