Thursday, November 28, 2024

Hyd ORR | ఔట‌ర్‌పై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు.. !

ఇక నుంచి హైద‌రాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాల నివారణకు రాచకొండ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర‌కు ఓఆర్‌ఆర్‌ ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాల విశ్లేషణ, నివారణ చర్యల కోసం యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీమ్ ను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement