Thursday, April 25, 2024

మ‌ధ్య‌త‌ర‌గ‌తికి పాకుతున్న డ్ర‌గ్స్‌.. ఆసియా దేశాల్లోనే అధికంగా వాడ‌కం

ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే లభ్యమయ్యే ఖరీదైన డ్రగ్స్‌.. ఇప్పుడు చిత్రపరిశ్రమ, ఐటీసెక్టార్‌ మొదలు.. మధ్యతరగతి ప్రజలు, చివరికి స్కూలు విద్యార్థులకూ అందుబాటులోకి వచ్చేసింది. డ్రగ్స్‌కు బానిసవుతున్న వారిలో అధికులు ధనవంతుల కుటుంబాలకు చెందినవారు ఉంటున్నారు. తల్లిదండ్రుల నిరాదరణ, ఒంటరితనం, చదువు, ఒత్తిడి.. ఇత్యాది కారణాల వల్ల యువత డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నట్లు తేలింది. ఇప్పుడు ఈ అలవాటు క్రమేణా మధ్యతరగతి కుటుంబాలకు పాకుతున్నట్లు వెల్లడవు తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. డ్రగ్స్‌ వినియోగం ఆసియా దేశాల్లోనే అధి కంగా ఉన్నట్లు ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. మన దేశంలో సుమారు 10 లక్షలమంది యువత నల్లమందుకు బానిసైనట్లు తన నివేదికలో తెలిపింది. అయితే ఈ సంఖ్య 15 లక్షలు దాకా ఉంటుందని అనధికార సమాచారం. నైజీరియా లాంటి ఆఫ్రికాదేశాలు, ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే కొకైన్‌, చరాస్‌ వంటి డ్రగ్స్‌ ఇప్పుడు లోకల్‌గానే లభిస్తున్నాయి. గోవా, జమ్మూకశ్మీర్‌ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఖరీదైన డ్రగ్స్‌ చేరుతున్నాయి.

మాదకద్రవ్యాల వ్యాపారం చేసేవారు మధ్యతరగతి యువతను లోబరుచుకుని మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిపోతోంది. మాదక ద్రవ్యాల సరఫరా ఒక చెయిన్‌లా సాగుతుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండే కిళ్లి దుకాణాలు, కాఫీ షాపుల ద్వారా కూడా వీటి సరఫరా సాగుతూ ఉంటుంది. మాదక ద్రవ్యాల మత్తుతో రాత్రంతా కాలక్షేపం చేస్తే చోటు చేసుకునే విపరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడం పెద్ద కష్టం కాదు. పబ్‌లలో, బార్లలో యథేచ్ఛగా ఎగసిపడే మద్యం సీసాల పొంగుల మధ్యనే వివిధ రకాల వేడుకలు నిర్వహించుకుంటున్నారు. పబ్‌లు భారత సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడుతున్న వారి వికార చేష్టలు, నోటి వెంట వచ్చే బూతులు సమా జాన్ని వెక్కిరిస్తున్నాయి. ఇందులో యువతులు కూడా ఉండడం అత్యంత అవమానకరం. దారుణ విషాదం..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement