Friday, April 19, 2024

Drugs Matter: ఆర్యన్-అనన్య.. వందల కొద్దీ చాటింగ్స్.. అవేంటో తెలుసా?

Bollywood: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఊహించని విధంగా అనన్య పాండే ఇరుక్కుంది. ఎప్పుడైతే ఆర్యన్ మొబైల్ ఫోన్ ను ఎన్సీబీ అధికారులు క్రాక్ చేశారో అందులో అనన్య పేరు ప్రముఖంగా కనిపించింది. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అధికారులు దాచిపెట్టారు. సరిగ్గా ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన రోజున దీనికి సంబంధించిన వివరాల్ని కోర్టుకు సమర్పించారు.

ఇట్లా వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎన్సీబీ.. ఆ వెంటనే అనన్య పాండే నివాసంలో సోదాలు చేప‌ట్టింది. ఆమెను 2 గంటల పాటు తమ ఆఫీసులో ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఆర్యన్-అనన్య మధ్య వందల కొద్దీ చాటింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ చాటింగ్స్ లో డ్రగ్స్ ప్రస్తావన కూడా ఉన్నట్టు ఎన్సీబీ నిర్థారించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఈరోజు అనన్య పాండేను మరోసారి ఎన్సీబీ అధికారులు విచారణకు పిలిచారు. ఆమెకు చెందిన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను ఆధికారులు సీజ్ చేశారు. దానికి సంబంధించి ఈరోజు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement