Friday, October 4, 2024

TG | మాదాపూర్ లో డ్రగ్స్ క‌ల‌క‌లం… ముగ్గురి అరెస్ట్..!

మాదాపూర్ లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని అరెస్ట్ పోలీసులు చేసారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా లాభాలు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద మొత్తంలో లాభాలు గడించేందుకు డ్రగ్స్ అమ్మకాలు ప్రారంభించారు.

కాగా, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో…. కాపు కాసి డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వ‌ద్ద‌ బెంగళూరు నుంచి తీసుకొచ్చిన 5.77 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ తో పట్టుబడిన వారిలో దత్తి లిథిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి ఎ మార్ట్ ఉన్నారు. పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే బెంగళూరుకు చెందిన మరో డ్రగ్ దిగుమతిదారుడు పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement