Friday, April 19, 2024

పంజాబ్‌ సరిహద్దులో డ్రోన్‌ కలకలం.. కూల్చేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

పంజాబ్‌ సరిహద్దులో ఓ డ్రోన్‌ను బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) కూల్చేసింది. చైనాలో తయారైన డ్రోన్‌గా గుర్తించారు. భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దు వద్ద ఉన్న అమృత్‌సర్‌ సెక్టార్‌ ధనోయి కలాన్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీఎస్‌ఎఫ్‌ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. సరిహద్దు వద్ద రాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో.. శుక్రవారం తెల్లవారుజామున కొన్ని శబ్దాలు వినిపించాయి. దీంతో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ మరింత ముమ్మరం చేశామన్నారు. పరిస్థితిని తెలుసుకునేందుకు పారా బాంబును పెల్చేడంతో.. ఆ ప్రాంతం ఒక్కసారిగా ప్రకాశవంతమైంది.

ఓ క్వాడ్‌ కాప్టర్‌ను గుర్తించి కూల్చేశాం. అది పాకిస్తాన్‌ సరిహద్దు నుంచి వచ్చింది. రామ్‌ తీర్థ్‌ ఏరియాలో దాన్ని నేలకూల్చేశాం. డీజేఐ మ్యాట్రైస్‌ 300 మోడల్‌ క్వాడ్‌కాప్టర్‌.. చైనాలో తయారు చేసినట్టు గుర్తించాం. డ్రోన్‌ను కూల్చడంతో మరింత అప్రమత్తమయ్యామని, ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement