Wednesday, April 24, 2024

2డీజీ ఔషధం సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయనున్న డీఆర్‌డీవో

కరోనాకు వ్యతిరేకంగా అభివృద్ధి చేసిన 2డీజీ (డియోక్సీ-డి-గ్లూకోజ్) ఔషధానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పలు ఫార్మా కంపెనీలకు బదిలీ చేసేందుకు డీఆర్‌డీవో (భారత రక్షణ పరిశోధన సంస్థ) నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఈ మేరకు ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులు (ఈఓఐ) ఆహ్వానించింది. 2-డీజీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీవో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (INMAS) అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలిసిన విషయం తెలిసిందే.

కరోనా బాధితులకు వినియోగించేందుకు డీసీజీఐ అత్యవసర అనుమతి సైతం జారీ చేసింది. ఔషధంపై డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఇప్పటికే డీఆర్‌డీఓతో కలిసి పనిచేస్తోంది. ప్రయోగాత్మక ఉత్పత్తి దశ పూర్తిచేసి, వాణిజ్య ప్రాతిపదికన 2-డీజీ మందును దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీ వరకు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తులను (ఈఓఐ) పంపాలని సూచించింది. టెక్నికల్‌ అసెస్‌మెంట్‌ కమిటీ (టీఏసీ) పరిశీలించి, 15 దేశీయ కంపెనీలకు.. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ బేసిస్‌ విధానంలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయనున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement