Wednesday, April 24, 2024

రజనీకాంత్ అభిమానులకు రేపు డబుల్ బొనాంజా

తమిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా దర్శకుడు శివ తెర‌కెక్కించిన ‘అన్నాత్తే’ చిత్రం దీపావళికి విడుదల కానుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా నుండి రేపు రెండు అప్‌డేట్స్ రానున్న‌ట్ల మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబ‌ర్ 10న ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ లాంచ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రం నుంచి రజినీ ఫస్ట్ లుక్‌ను మొదట ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తుండగా ఈ లుక్ తాలూకా అదిరే మోషన్ పోస్టర్ టీజర్‌ను సాయంత్రం 6 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ఖరారు చేశారు.

ఈ విష‌యం తెలియ‌జేసేందుకు ఒక పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా.. ఇందులో వెనక్కి తిరిగి ఉన్న ర‌జ‌నీకాంత్‌, శూలాలు, భ‌వ‌నాలు క‌నిపిస్తున్నాయి. గత రెండు సినిమాలు రజనీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన నేపథ్యంలో.. అన్నాత్తే చిత్రం ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌క అలరిస్తుంద‌ని మేకర్స్ అంటున్నారు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ చెల్లెలిగా నటిస్తోందని సమాచారం. ఖుష్బూ, న‌య‌న‌తార, మీనా ఈ సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement