Thursday, April 25, 2024

వరదల్లో నష్టపోయినవారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి.. ఎమ్మెల్యే రఘునందన్ రావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలతో సంభవించిన వరదల్లో ఇళ్లు కోల్పోయినవారికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల కోసం జరిగిన మాక్ పోలింగ్‌లో పాల్గొన్న ఆయన అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మంత్రులు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారని మండిపడ్డారు. జనజీవనం స్తంభించినా సరే మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేదని ఆరోపించారు. తక్షణమే మంత్రులు రంగంలోకి దిగి వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీలోని ఎమ్మెల్యేలందరూ ద్రౌపది ముర్ముకు ఓటేయాలని ఆయన కోరారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి గిరిజన మహిళకు రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిందని, గిరిజన ఎమ్మెల్యేలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ఆయన సూచించారు. గత రాష్ట్రపతి ఎన్నికల్లో 5% ఓట్లు చెల్లుబాటు కాలేదని, ఈసారి నూటికి నూరు శాతం ఓటింగ్ నమోదవ్వాలన్న ఉద్దేశంతో మాక్ పోలింగ్ నిర్వహించారని రఘునందన్ రావు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement