Thursday, April 25, 2024

అతి పొట్టి టీనేజ‌ర్ గా డోర్ బ‌హ‌దూర్ ఖ‌పంగి – గిన్నిస్ రికార్డ్

నేపాల్ కి చెందిన డోర్ బ‌హ‌దూర్ ఖ‌పంగి గిన్నిస్ రికార్డు కెక్కాడు..ఈయ‌న ప్ర‌పంచంలోనే అత్యంత పొట్టి టీనేజ‌ర్ గా ఈ రికార్డుని సొంతం చేసుకున్నాడు. కాగా 18ఏళ్ల బహదూర్ కేవలం 73 సెంటీమీటర్లు పొడవు మాత్రమే ఉన్నారు. ప్రపంచంలోనే పొట్టి వ్యక్తిగా కొలంబియాకు చెందిన పొట్టి వాడుగా హెర్నాండెజ్ పేరిట ఉంది. అయితే ఈయన ఎత్తు సెంటీమీటర్లు కావడం విశేషం. ఇంతకుముందు రికార్డు 67 సెంటీ మీటర్లు ఎత్తు ఉండే ఖగేంద్ర థాపా మగర్ పేరిట ఉండేది. అయితే ఈయన 2020 సంవత్సరంలో 32 ఏళ్ల వయసులో మరణించారు. ప్రపంచంలోనే పొట్టి మహిళ రికార్డు భారత్ కి చెందిన జ్యోతి ఆమ్గే పేరిట ఉంది. ఈమె ఎత్తు 62 సెంటీమీటర్లు కావడం విశేషం.ఒక‌రిని మించి ఒక‌రి రికార్డులు స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోతున్నాయి. కొంద‌రూ పొడ‌వుగా పెరిగి రికార్డు సృష్టిస్తే.. మ‌రికొంద‌రూ పొట్టిగా ఉండి రికార్డుల‌ను సృష్టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement