Monday, June 5, 2023

మద్యం కుంభకోణంలో ఎంత‌టి వారున్నా వదిలిపెట్టవద్దు : భట్టి విక్రమార్క

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కుంభకోణాలకు నోటీసులిస్తే రాష్ట్ర‌ ప్రజలకు ఎలా అమానకరం? అక్రమాలు చేసి తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అవినీతిని రూపుమాపుతామని పార్టీ పెట్టిన కేజ్రీవాల్‌.. దేశంలో ఏ పార్టీ చేయలేనంత అవినీతిని చేశారని, మద్యం కుంభకోణంలో ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని బ‌ట్టి డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ అని ఓ పార్టీ పెట్టి అర్వింద్ కేజ్రీవాల్ దేశంలో ఎవరూ చేయలేనంత అవినీతి చేశార‌న్నారు. ఇంత జరుగుతుంటే అన్నాహజరే ఎక్కడున్నారు? ఢిల్లీ మద్యం కుంభకోణంపై అన్నాహజరే మాట్లాడాల‌న్నారు. ప్రభుత్వ పాలసీకి మంత్రివర్గం ఆమోదం ఉండాల్సిందే అన్నారు. కేజ్రీవాల్‌ కూడా రాజీనామా చేయాలని, మద్యం కేసుకు తెలంగాణకు ఏం సంబంధం అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement