Wednesday, October 9, 2024

అధైర్యపడొద్దు.. అండగా నేనుంటా : మంత్రి హ‌రీశ్ రావు

నారాయణరావుపేట, చిన్నకోడూర్ మండలంలోని పలు గ్రామాలలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రామ మాజీ సర్పంచ్ పొన్నాల సత్తయ్య తల్లి ఎల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు వారి కుటుంబాన్ని మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదే విధంగా జక్కాపూర్ గ్రామ ఏంపీటీసీ గోపాలపురం భాను గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ మేరకు వారి నివాసంలో ఆయన్ని పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. అదే గ్రామంలో అనారోగ్య కారణంగా మృతి చెందిన మల్లారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అధైర్యపడొద్దని వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి వారిలో మంత్రి మనోధైర్యాన్ని నింపారు. అనంతరం చిన్నకోడూర్ మండలం గంగపూర్ గ్రామ సర్పంచ్ పన్యాల లింగారెడ్డి తల్లి సుగుణమ్మ అనారోగ్య కారణంగా బాధపడుతూ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అదే గ్రామానికి చెందన మహాదేవోజు విష్ణు బార్య నవ్యశ్రీ, మహేందర్ భార్య అరుణ ఇటీవల ప్రమాద వశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ మేరకు వారి నివాసంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి మంత్రి హ‌రీశ్ రావు ఓదార్చారు. అనంతరం పట్టణంలోని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్ తల్లి శకుంతల ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు చిప్ప ప్రభాకర్ నివాసంలో ఆమె మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేసి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement