Monday, December 9, 2024

TG | సీఎం రిలీఫ్ ఫండ్ కు యాదాద్రి వర్తకుల విరాళం

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వస్వం కోల్పోయి అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు యాదగిరిగుట్ట వర్తక సంఘం సభ్యులు, కళ్యాణకట్ట నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు రూ.2 లక్షల చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్‌కు (శనివారం) అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్యకు చెక్కులను అందజేశారు. యాదగిరిగుట్ట వర్తక సంఘం రూ.లక్ష చెక్కులను, యాదగిరిగుట్ట కల్యాణకట్ట నాయీ బ్రాహ్మణ సంఘం రూ.లక్ష చెక్కులను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement