Friday, December 1, 2023

ఐటీ నోటీసులు ఇవ్వ‌గానే గుండెపోటు వ‌స్తుందా? : ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు

మంత్రి మ‌ల్లారెడ్డి కుమారుడు మ‌హేంద‌ర్ రెడ్డి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.. దీంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ఘునంద‌న్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడులు జరిపినప్పుడల్లా గుండెపోటు వచ్చిందని అందరూ ఆసుపత్రుల్లో చేరుతుంటారని, ఇది సాధారణ విషయమేనని చెప్పారు. ఐటీ నోటుసులు రాగానే గుండె పోటు ఎలా వ‌స్తుంద‌న్నారు. మహేందర్ రెడ్డి నిన్న ఉదయం కూడా వాకింగ్ చేశారని… ఐటీ రెయిడ్స్ ప్రారంభం కాగానే గుండెనొప్పి వ‌స్తుందా అంటూ ఎద్దేవా చేశారు. మల్లారెడ్డి తన ఫోన్ దాచే ప్ర‌త‌య‌త్నం చేశారు.. అయినా ఐటీ అధికారులు కనిపెట్టారని చెప్పారు. తప్పులు చేయకపోతే ఫోన్ దాచి పెట్టాల్సిన అవసరం ఎందుకొస్తుందని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement