Tuesday, April 23, 2024

గాడ్ ఫాదర్ 2 కూడా చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నా- మోహన్ రాజా

దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ..గాడ్ ఫాదర్’ తో మన టీమ్ పై మేకర్స్ కి ఒక నమ్మకం కుదిరింది కనుక, ‘గాడ్ ఫాదర్ 2 కూడా చేసే అవకాశం త్వరలోనే లభిస్తుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఒక సినిమా మొదలు పెడితే ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఛాలెంజింగ్ గా తీసుకుంటూ ముందుకు వెళ్లడం నేర్చుకున్నానని అన్నారు. కథను ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ట్రెండ్ పోయింది ..ఇప్పుడు కథను ఎలా చెబుతున్నామనేదే ముఖ్యమైపోయింది. కథను ఇంట్రెస్టింగ్ గా చెబితేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. కథలో నుంచి ప్రేక్షకులు ఏ మాత్రం జారిపోకుండా చూసుకోవాలి. లేదంటే వెంటనే వాళ్లు నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్లిపోతున్నారు. అందువల్లనే వాళ్లని ఎంటర్టైన్ చేసే విషయంలో మైక్రో సెకన్స్ గ్యాప్ కూడా రాకుండా చూసుకోవాలి. అందువల్లనే చివరి నిమిషం వరకూ కొత్తదనం కోసం పోరాడుతూనే ఉంటాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో భయమే జయం అన్నట్టుగా పనిచేయకపోతే కష్టమే. ఏ సినిమాకి ఆ సినిమానే లైఫ్ అనేట్టుగా నా వర్కింగ్ స్టైల్ ఉంటుంది . లూసిఫర్’ సినిమాను రీమేక్ చేయడం ఒక బాధ్యతత్తో కూడుకున్న పని. పైగా ఆ రీమేకును మెగాస్టార్ తో చేస్తున్నాం .. ఇది ఇంకా బాధ్యతతో కూడుకున్న పని. అందువలన ఈ రెండు విషయాలను ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ ముందుకు వెళ్లడం జరిగింది. చిరంజీవి మాస్ యాక్షన్ తో కూడిన పాత్రలను చేయడంలో మాస్టర్. ఆ తరహా సినిమాలను ఆయనతో చేయాలని ఉంది. అందుకు సంబంధించిన కొన్ని ఐడియాస్ నా దగ్గరున్నాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement