Tuesday, April 23, 2024

షో రూమ్ మొదటి అంతస్థు నుంచి కారు బోల్తా…తరువాత ఏమైందో తెలుసా ?

కార్ల షో రూమ్ మొదటి అంతస్థు నుంచి ఓ కారు బోల్తా పడ్డ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎల్ బి నగర్ పరిధి లోని అల్కాపురి కూడలి వద్ద ఉన్న షో రూమ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. టాటా షోరూమ్‌ మొదటి అంతస్థు లో ఓ వ్యక్తి కారును కొనుగోలు చేసి స్టార్ట్‌ చేశాడు.

ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి మరో కారుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మరో ద్విచక్రవాహనం ధ్వంసం అయింది. అంతే కాకుండా ప్రమాదంలో కొనుగోలుదారు, బాలుడికి స్వల్ప గాయాలు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement