Friday, March 29, 2024

పెరిగిన బంగారం ధరలు…ఎంత పెరిగిందో తెలుసా ?

బంగారం ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. సాధారణంగా ఇండియా లో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. మగువలకు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరలు ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 46,200 కి చేరింది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.50,400 కి చేరింది. బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.900 పెరిగి 77,500 పలుకుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement