Wednesday, March 27, 2024

Breaking: డ్ర‌గ్స్ డీలింగ్​ కేసులో మాజీ ఎంపీ కుమారుడు.. బెంగ‌ళూరులో డీకే శ్రీ‌నివాసులు అరెస్టు

డ్ర‌గ్స్ స‌ప్ల‌య్‌ ఆరోప‌ణ‌ల‌తో దివంగ‌త ఎంపీ డీకే ఆదికేశ‌వులు నాయుడు కుమారుడు డీకే శ్రీనివాసులు నాయుడును నార్కోటిక్స్ డ్ర‌గ్స్ కంట్రోల్ (ఎన్‌సీబీ) అధికారులు ఇవ్వాల‌ (బుధ‌వారం) అరెస్ట్ చేశారు. రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖుల‌కు శ్రీనివాసులు నాయుడు డ్ర‌గ్స్ స‌ప్ల‌య్‌ చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఎన్‌సీబీ అధికారులు బెంగ‌ళూరులోని శ్రీనివాసులు నాయుడుతో స‌హా పలువురు ఇళ్ల‌లో సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో శ్రీనివాసులు నాయుడు ఇంట్లో పెద్ద ఎత్తున డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డిన‌ట్లు స‌మాచారం.

శ్రీనివాసులు నాయుడు ఇంట్లో డ్ర‌గ్స్ దొరిక‌డంతో ఆయ‌న‌ను అక్క‌డిక‌క్క‌డే ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చిత్తూరు కేంద్రంగా పాలిటిక్స్‌ సాగిస్తున్న డీకే ఆదికేశ‌వులు నాయుడు కుటుంబం.. బెంగ‌ళూరులో వ్యాపారాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరులోనే శ్రీనివాసులు నాయుడు ఉంటున్నారు. ఏపీ, క‌ర్నాట‌కకు చెందిన ప‌లువురు రాజ‌కీయ‌, సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుల‌తో సంబంధాలు కొన‌సాగిస్తున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement