Thursday, March 23, 2023

బాల సధనం నుంచి ఇద్ధరు బాలికల అదృశ్యం.. నిజామాబాద్ జిల్లాలో ఘ‌ట‌న‌

నిజామాబాద్ అర్బన్ (ప్ర‌భ న్యూస్‌) : నిజామాబాద్ నగరంలోని సిడిబ్ల్యూసి బాల సధనం నుంచి ఇద్ధరు బాలికలు పారిపోయారని బాలసధనం సూపరింటెండెంట్ సునంద‌ పోలిసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు మూడవ టౌన్ పోలిస్ లు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

- Advertisement -
   

నవిపేట్ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన అనిత (15), బోదన్ పట్టణంలోని శక్కర్ నగర్ కు చెందిన నజీమా బేగం (16) సిడబ్ల్యూసి డిపార్ట్ మెంట్ నిర్వ‌హించే షెల్టర్ హోమ్‌లోని బాలసధనంలో ఉంచారు. సోమవారం ఉదయం అక్క‌డి నుంచి వారు పారిపోయారన్న‌ పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. బాలికల అచూకి తెలిసిన వారు సమీపంలోని పోలిస్ స్టేషన్ లో సమాచారం అందించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement