Thursday, October 3, 2024

Director : ప్ర‌శాంత్ నీల్ బ‌ర్త్ డే.. ప‌లు ఇంట్రెస్టింగ్ విశేషాలు

స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమాల్లో స‌లార్ ఒక‌టి. కాగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా డార్లింగ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. దగ్గరుండి కేక్ కట్ చేయించారు. కేక్ పీస్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. అలాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా ప్రశాంత్ నీల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రశాంత్ నీల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.

ప్రశాంత్ నీల్ పూర్తి పేరు ప్రశాంత్ నీలకంఠపురం. 1980 జూన్ 4న ఆయన కర్ణాటకలోని నీలకంఠపురంలో జన్మించారు. తన ఊరిపేరును తన పేరుతో చేర్చారు. నీలకంఠపురంను నీల్ గా షార్ట్ చేసి ప్రశాంత్ నీల్ గా పేరును మార్చుకున్నారు. ప్రశాంత్ నీల్ తెలుగు ఫ్యామిలీకి చెందిన వాడే. కానీ బెంగళూరులో సెటిల్ అయ్యారు. తల్లిదండ్రులు సుభాష్, భారతీ. ప్రశాంత్ నీల్ కు 2010లో లిఖితతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. అప్పుడప్పుడు పిల్లలతో ఆడుకునే కొన్ని ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతూనే వచ్చాయి. నీల్ కు ఒక అక్క విద్య కూడా ఉంది. ఆమె కన్నడ హీరో శ్రీమురళీని వివాహం చేసుకుంది. ఇక ఏపీ మాజీ మినిష్టర్ రఘు వీరా రెడ్డి ప్రశాంత్ నీల్ కు బంధువు.

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో పాటు ఇండస్ట్రీలోనూ వారి కుటుంబానికి మంచి రిలేషన్స్ ను ఉన్నాయి. సినీ రంగంలోకి నీల్ కేవలం ప్యాషన్, డబ్బు అవసరం ఉండే అగుడుపెట్టాడని చెప్పుకొచ్చాడు. అందుకు తగిన కోర్సులు పూర్తి చేశాడు. 2014లో తన బావ శ్రీమురళీతో ‘ఉగ్రం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ మూవీని షూట్ చేసే క్రమంలోనే ‘కేజీఎఫ్’ చేయాలనే ఆలోచన పుట్టింది. ఆ తర్వాత నాలుగేండ్లు కష్టపడి KGF Chapter 1ను తెరకెక్కించారు. ఆ తర్వాత నాలుగేళ్లకు KGF Chapter 2విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ.1800 కోట్ల వరకు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డు సెట్ చేసింది. ప్రస్తుతం ‘సలార్’తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. ప్రభాస్ – శృతి హాసన్ జంటగా నటించారు. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది NTR31 షూట్ ను ప్రారంభించనున్నారు. తీసినవి మూడు చిత్రాలే అయిన ప్రశాంత్ నీల్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరడం విశేషం. టాలీవుడ్ కు ఎస్ఎస్ రాజమౌళి ఎలాగో.. కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రశాంత్ నీల్ అలా అంటూ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement