Wednesday, April 24, 2024

మరో వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్న దర్శకుడు మారుతీ.. ఆహాలో ఇంటింటి రామాయణం

ఇంటింటి రామాయ‌ణం` పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈసారి ఆహా కోసం. మారుతి ఈ వెబ్ సిరీస్ కి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. గీతా ఆర్ట్స్ తో ఉన్న అనుబంధం కారణంగా మారుతి కూడా ‘ఆహా’కి మంచి కంటెంట్ ఇస్తున్నారు. సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాపులో ఆయన ఓటీటీకి కంటెంట్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈ కథ తెలంగాణ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో నడుస్తుంది. ఇందులో ప్రధానమైన పాత్రను రాహుల్ రామకృష్ణ పోషించాడు.

అతని కుటుంబం ఎలాంటి సమస్యల్లో పడుతుంది .. వాటి బారి నుంచి బయటపడటానికి ఆయన ఏం చేస్తాడు అనేదే కథ.ఈ వెబ్ సిరీస్ లో రాహుల్ రామకృష్ణ జోడీగా ‘నవ్య’ కనిపించనుంది. ‘నా పేరు మీనాక్షి’ .. ‘ఆమె కథ’ వంటి టీవీ సీరియల్స్ ద్వారా ఆమె పాప్యులర్ అయింది. కీలకమైన పాత్రలో ‘గంగవ్వ’ కనిపించనుంది. తెలంగాణ యాస విషయంలో ఆమె ప్రత్యేకతను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కల్యాణి మాలిక్ ఈ వెబ్ సిరీస్ కి సంగీతాన్ని అందించారు. సితార నాగవంశీ సమర్పిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. ఈ సినిమా కు మారుతి షాడో డైరెక్టర్ అనే ప్రచారం కూడా జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement