Thursday, April 25, 2024

ఆదిపురుష్ స్టోరీపై డైరెక్టర్ క్లారిటీ.. షాకింగ్ న్యూస్ రివీల్ చేసిన డైరెక్ట‌ర్‌..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ పూర్తిచేశాడు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‏లో సలార్ మూవీ చేస్తున్నాడు. స్పిరిట్, ప్రాజెక్ట్ కే చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా.. కొన్ని షెడ్యూల్స్ ని కంప్లీట్ చేశాడు ప్ర‌భాస్.. ఆదిపురుష్ షూటింగ్ కూడా కంప్లీట్ కాగా, ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో క‌నిపించ‌నున్నాడ‌ని ముందు నుంచే వినిపిస్తున్న టాక్. తాజాగా ఆదిపురుష్ స్టోరీ అది కాదంటూ షాకింగ్ న్యూస్ చెప్పాడు డైరెక్టర్ ఓంరౌత్. అందరూ అనుకున్నట్టుగా ఈ మూవీ స్టోరీ ఉండదని, ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ రాముడు కాదంటూ డైరెక్టర్‌ ఓం రవుత్ స్వయంగా వెల్లడించారు.

ఈ మెగా మైథలాజికల్ వండర్‌ గురించి రీసెంట్‌గా నేషనల్ మీడియాతో మాట్లాడిన ఓం.. రామాయణగాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ప్రభాస్ కేరెక్టర్ పేరు రాముడు కాదని… ఆయన రాఘవ్‌ అనే పాత్రలో కనిపిస్తార‌ని. అంతేకాదు.. కృతిసనన్‌ పాత్ర పేరు కూడా సీత కాదని… జానకీ అని, సైఫ్ అలీఖాన్ పేరు లంకేష్ అని తెలిపారు. 2000లో ముంబై ఫిలిం ఫెస్టివల్‌లో చూసిన ఓ యానిమేషన్ సినిమానే రామాయణం తెరకెక్కించాలన్న ఆలోనకు మూలం అన్నారు. జపనీస్‌ ఫిలిం మేకర్‌ యుగో సాకో రూపొందించిన ప్రిన్స్ ఆఫ్ లైట్‌ మూవీ చూసిన తరువాతే రామాయణ కథను మరోసారి సినిమాగా చేయాల‌న్న ఆలోచన వచ్చిందన్నారు. ఒక ఫారినర్ రామాయణ కథను అంత గొప్పగా ఈ జనరేషన్‌కు చెపితే మనం ఏం చేస్తున్నాం అన్న ఆత్మ విమర్శ నుంచే ఆదిపురుష్ ఆలోచన వచ్చిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement