నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని సాధించింది విక్రమ్ చిత్రం. ఈ చిత్రంలో విశ్వ నటుడు కమల్ హాసన్ తో పాటు స్టార్ హీరోస్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ యాక్ట్ చేశారు. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విక్రమ్‌లో కమల్ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టాడు. ఇక ఇతర కీలక పాత్రల్లో నటించిన విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా అదరకొట్టారు. తమిళ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో ‘విక్రమ్: హిట్ లిస్ట్’ పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ సాదించిన సంధర్భంగా కమల్ హాసన్ దర్శకుడు లోకేష్ కు ఒక కాస్ట్లీ లెక్సస్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అంతే కాక తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఒక వీడియో కూడా విడుదల చేశారు కమల్ హాసన్.
Advertisement
తాజా వార్తలు
Advertisement