Thursday, April 25, 2024

బాలా డైరెక్ష‌న్ లో సూర్య.. ఈ మూవీ నుండి త‌ప్పుకున్న స్టార్ హీరో.. ఎందుకంటే

స్టార్ డైరెక్ట‌ర్ బాలా మూవీ నుండి త‌ప్పుకున్నాడు స్టార్ హీరో సూర్య‌. వీరిద్దరి కలయికలో వచ్చిన శివపుత్రుడు తమిళ,తెలుగు ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మళ్లీ 18ఏళ్ళ త‌ర్వాత వీరిద్దరూ క‌లిసి అచలుడు అనే సినిమాను స్టార్ట్ చేశారు. ఈమూవీపై ప్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారగా అంచనాలు ఉన్నాయి. ఈక్రమంలో 40శాతం షూటింగ్‌ కూడా పూర్తయింది. కాగా తాజాగా ఈ సినిమా నుండి సూర్య తప్పుకున్నట్లు దర్శకుడు బాలా ప్రకటించి షాక్ ఇఛ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎందుకు సూర్య ఈ సినమా నుంచి తప్పుకున్నాడంటే.. ఈ క్రమంలో డైరెక్టర్ బాలా సోషల్‌ మీడియాలో ఓ లేఖను విడుదల చేసి క్లారిటీ ఇచ్చాడు.

ఆ లేఖలో బాల ఏమన్నాడంటే..అచలుడు కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని, దాంతో ఈ సినిమా కథ అంతా మారిపోవడంతో.. సూర్య ఈ కథకు సూట్ అవ్వడని దర్శకుడికి అనిపించిందట. దాంతో 40 శాతం షూటింగ్ పూర్తి అయిన తరువత కూడా సూర్య ఈసినిమా నుంచి తప్పుకోవల్సి వచ్చిందట.అయితే బాల – సూర్య మధ్య కమ్యూనికేషన్ తో పాటు ఇద్దరు పరస్పర అంగీకారంతోనే ఈ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. సూర్యకు కూడా ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బాలా లెటర్‌లో వివరంగా తెలిపాడు. అయితే సూర్య తప్పుకున్నా ఈ సినిమా మాత్రం కొనసాగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చాడు. అయితే అందులో ఎవరు హీరోగా నటిస్తారు అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement