Thursday, March 28, 2024

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 13.73 లక్షల కోట్లు.. గత ఏడాది కంటే 17 శాతం పెరుగుదల

దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గత ఏడాది కంటే 17 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 13.73 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. ప్రస్తుత పూర్తి ఆర్ధిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ఈ మొత్తం 83 శాతానికి సమానమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఈ పన్నుల్లో వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్‌ పన్ను కలిపి ఉంటాయి.


గత సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి 2023 మార్చి 10 వరకు మొత్తం ప్రత్యక్ష పన్నులు 16.68 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇందులో 2.95 లక్షల కోట్లు రిఫండ్స్‌ పోగా నికరగా 13.75 లక్షల కోట్లు వచ్చాయి. బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఇవి 96.67 శాతానికి సమానం. సవరించిన అంచనాల ప్రకారమైతే ఇవి 83.19 శాతానికి సమానం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగియడానికి ఇంకా 18 రోజుల వరకు సమయం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement