Tuesday, March 26, 2024

దిల్ వాలా క్రైమ్ క‌థ‌…

‘పూలరంగడు’, ‘చుట్టాలబ్బాయి’ లాంటి చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దిల్‌ వాలా. ‘మత్తువదలారా’, ‘సేనాపతి’ చిత్రాలతో ప్రశంసలు అందుకున్న నరేష్‌ అగస్త్య హీరోగా నటిస్తున్నాడు. నబిషేక్‌, తూము నర్సింహా పటేల్‌ నిర్మిస్తు న్నారు. -కై-మ్‌ కామెడీ జోనర్‌లో రూపుదిద్దుకుంటు-న్న ఈ చిత్రం వైజాగ్‌ లో 20 రోజుల షూటింగ్‌ జరుపుకుంది. దీంతో టాకీ పార్ట్‌ పూర్తి చేసుకుంది.
వైజాగ్‌ షెడ్యుల్‌ లో నరేష్‌ అగస్త్య, రాజేంద్రప్రసాద్‌, హీరోయిన్‌ శ్వేత అవస్తి, సెకండ్‌ హీరోయిన్‌ ప్రగ్యా నైనా, అలీ రెజాల పై కీలక సన్నివేశాలతో పాటు- ఓ పాటని చిత్రీకరించారు. దీంతో 95 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. వీటిని బ్యాంకాక్‌ లో చిత్రీకరిస్తారు. మార్చి లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్‌ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరి మాట్లాడుతూ ” వైజాగ్‌ లో రుషికొండ, తొట్లకొండ బీచ్‌, యారాడ బీచ్‌ , అరకు లాంటి అందమైన లోకేషన్స్‌ లో చిత్రీకరించాం. అని అన్నారు.
ప్రముఖ ఎంపీ ఎంవివి సత్య నారాయణ ఈ చిత్రంలో కీలక పాత్ర పోహిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు వున్నాయి. అనూప్‌ రూబెన్స్‌ ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. ఈ చిత్రానికి కె ప్రసాద్‌ ప్రసాద్‌ ఎడిటర్‌ గా, అనిత్‌ సినిమాటోగ్రఫర్‌ గా పని చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement