Saturday, March 23, 2024

వేణుకి మ‌రోసారి ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు..!

క‌థ విష‌యంలో నిర్మాత దిల్ రాజుని ఒప్పించ‌డం అంత తేలికైన విష‌యం కాద‌నే సంగ‌తి తెలిసిందే. అలాంటిది దిల్ రాజు బ్యానర్లో కమెడియన్ వేణు ‘బలగం’ సినిమాను తెరకెక్కించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బలగం సినిమాలో ఏముందా అని వెళ్లినవారికి, దిల్ రాజు ఎందుకు ఒప్పుకున్నాడనే విషయం అర్థమవుతుంది. తెలంగాణ నేపథ్యంలోని గ్రామీణ సంస్కృతిని ఆవిష్కరిస్తూ, కామెడీని .. ఎమోషన్ ను కలిపి నడిపించిన తీరుకు ఎక్కువ మార్కులు పడ్డాయి. పాటల పరంగా కూడా ఈ సినిమా సందడి చేసింది. వేణు పనితీరు నచ్చడం వలన ఆయనకి దిల్ రాజు మరో ఛాన్స్ ఇచ్చారనే టాక్ రెండు రోజులుగా వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో ప్రాజెక్టు ఓకే అయిందనేది తాజా సమాచారం. ఓ మాదిరి బడ్జెట్ లోనే ఈ సినిమా రూపొందనుందట‌. దిల్ రాజు ప్రొడక్షన్స్ పై నిర్మితమయ్యే ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement