Tuesday, April 23, 2024

వెస్టిండీస్‌లో ధావన్‌ సేన.. 22 నుంచి వన్డే సిరీస్‌

వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని టీమిండియా పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌కు మంగళవారం చేరుకుంది. ధావన్‌ సేన మాంచెస్టర్‌ నుంచి ప్రత్యేక విమానంలో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌కు చేరుకుంది. ఇక హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో పాటు ఇతర శిక్షణ సిబ్బంది బుధవారం వెళ్లనుంది. వన్డే సిరీస్‌కు రోహిత్‌ శర్మ దూరం కావడంతో భారత జట్టు సారథిగా శిఖర్‌ ధావన్‌కు కెప్టెన్‌ బాధ్యతలను బీసీసీఐ అప్పగించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ సిరీస్‌కు విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమీ వంటి సీనియర్‌ ఆటగాళ్లుకు విశ్రాంతినిచ్చారు.

కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌, వైస్‌ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా వ్యవహరించనున్నారు. ఇక జట్టులో రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, యజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, అవేష్‌ ఖాన్‌, ప్రసిధ్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అర్షదీప్‌ సింగ్‌ ఉన్నారు. 22న పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లను 2-1తేడాతో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement