Wednesday, April 24, 2024

నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న ధ‌నుష్ మూవీ సార్..

వెంకీ అట్లూరి డైరుక్ష‌న్ లో తమిళ స్టార్ హీరో ధనుష్ తొలి డైరెక్ట్ తెలుగు మూవీ సార్. తెలుగుతోపాటు తమిళంలోనూ వాతి పేరుతో రిలీజైన ఈ సినిమా మంచి వసూళ్లతో సక్సెస్‌ఫుల్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఫిబ్రవరి 17న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.118 కోట్లు భారీ కలెక్షన్లు రాబట్టింది. 

అయితే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోనూ రికార్డులు కొల్లగొడుతోంది. గత శుక్రవారం (మార్చి 18) నుంచి సార్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తెలుగుతోపాటు తమిళం, హిందీల్లోనూ రిలీజైందీ సినిమా. అయితే నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్స్ లో తమిళ వెర్షన్ నంబర్ వన్ కాగా తెలుగు, హిందీ వెర్షన్లు రెండు, మూడు స్థానాల్లో ఉండటం విశేషం.

ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న రెండో మూవీ ఈ వాతి. ఇంతకు ముందు అజిత్ నటించిన తునివు కూడా మంచి టాక్ కొట్టేసింది. ఈ సార్ మూవీలో ధనుష్ తోపాటు సంయుక్త, తనికెళ్ల భరణి, సాయి కుమార్, సముద్రఖని, సుమంత్ నటించారు. సార్ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంతకుముందు డిలీట్ చేసిన ఓ సీన్, బిహైండ్ ద స్క్రీన్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement