Thursday, April 25, 2024

ఇండియాలోనే బెస్ట్ యాక్ట‌ర్ ఎన్టీఆర్ …

విశ్వక్‌సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం దాస్‌ కా ధమ్కీ. దీనికి ఆయనే దర్శకత్వం వహిస్తున్న నిర్మిస్తు న్నారు. తక్కువ సమయంలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్‌ నటిస్తున్న దాస్‌ కా ధమ్కీ ఇదే వారంలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జూ.ఎన్టీఆర్‌ హాజరవ డంతో ప్రత్యేకత సంతరించుకుంది.

”సినిమా పట్ల విశ్వక్‌ సేన్‌కి ఎంతో పిచ్చి ఉంది.
ఆ పిచ్చి తగ్గిపోకూడదు. ఇలాంటివాళ్లను ప్రోత్స హిస్తేనే పరిశ్రమ ఇంకా ముందుకెళుతుంది. ‘దాస్‌ కా ధమ్కీ’ హిట్‌ అవ్వాలి” అని ఈ సందర్భంగా హీరో ఎన్టీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ”ఒకే చట్రంలో ఇరుక్కుపోతున్నానని చాలా కాలం తర్వాత తెలుసుకు న్నాను. మీరు (అభిమానులు) కాలర్‌ ఎత్తుకునే సిని మాలు చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట అన్నప్పుడే నటు-డిగా నేను మళ్లీ పుట్టాను. వైవిధ్యమైన నటన కోసం నేను తాపత్రయ పడుతున్నాను కాబట్టే మిమ్మ ల్ని కాలర్‌ ఎగరేసు కునేలా చేస్తున్నానని అనుకుంటు-న్నాను. విశ్వక్‌ కూడా ఒకే తరహా పాత్రల నుంచి బయటికొచ్చి, కొత్తగా చేస్తున్నాడు. ‘దాస్‌ కా ధమ్కీ’ బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలి. ఆ తర్వాత తను దర్శకత్వం మానే యాలి. ఎందుకంటే కొత్త యువ దర్శకులకు నీలాంటి వాళ్లు అవకాశాలు ఇవ్వాలి. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ చిత్ర పటంలో ఆల్‌-టైమ్‌ టాప్‌లో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ రోజు ప్రపంచ చిత్రపటంలో నిలబ డిందంటే, ఆస్కార్‌ అవార్డుని సొంతం చేసుకుం దంటే దానికి మా యూనిట్‌తో పాటు- యావత్‌ తెలు గు, భారతదేశ చిత్రపరిశ్రమ, ప్రేక్షక దేవుళ్లు కూడా కారణం. కీరవాణి, చంద్రబోస్‌గార్లు ఆస్కార్‌ అవార్డు తీసుకుంటు-న్నప్పుడు నాకు వాళ్లు కనిపించలేదు.. ఇద్దరు భారతీయులు కనిపించారు.. ఇద్దరు తెలుగు వాళ్లు కనిపించారు” అన్నారు.

విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ ”ఇండియాలో బెస్ట్‌ యాక్టర్‌ ఎవరంటే ఎన్టీఆర్‌ అన్న అని నేను ఎప్పుడో చెప్పాను. నా సినిమాని ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్‌ వచ్చాడు. ఆయన రాకతో నా సినిమా బ్లాక్‌బస్టర్‌ స్టార్ట్‌ అయిపోయినట్లే”అన్నారు.
”ఫలక్‌నుమా దాస్‌’ తీసినప్పుడు మా అబ్బాయి విశ్వక్‌ ఎవరికీ తెలియదు. ఎంతో పబ్లిసిటీ- చేసి, సినిమా విడుదలకి ముందే స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. ‘దాస్‌ కా ధమ్కీ’ కోసం 15 నెలలు కష్టపడ్డాడు” అన్నారు కరాటే రాజు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ నివేద పేతురాజ్‌ సహా చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement