Thursday, April 25, 2024

ఫిబ్రవరి 17న రిలీజ్ కానున్న.. ధమ్కీ మూవీ

తెలుగు..తమిళం..మలయాళం..హిందీ భాషల్లో తెరకెక్కుతోంది ధమ్కీ చిత్రం. ఈ చిత్రంలో హీరోగా విష్వక్సేన్ నటిస్తున్నాడు. కాగా ఆయన సొంత బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి ఆయనే దర్శకుడు. ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన నాయికగా నివేదా పేతురాజ్ అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్ .. రోహిణి .. అజయ్ కనిపించనున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించిన ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమాతో విష్వక్ హిట్ కొడతాడేమో చూడాలి. ఇటీవలే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక శ్రీమంతుడికి ఎదురైన సమస్యను, ఒక సాధారణమైన వెయిటర్ ఎలా పరిష్కరించాడనేదే కథ. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. విష్వక్ యాక్షన్ లోకి దిగిపోయినట్టుగానే ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ కామెడీ జోనర్లో నడిచే సినిమా ఇది.

Advertisement

తాజా వార్తలు

Advertisement