Thursday, November 28, 2024

Devotional – శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, శ‌బ‌రిమ‌ల : కేరళలోని ప్ర‌ముఖ క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ నంబూద్రి నియ‌మితుల‌య్యారు. లాట‌రీ ప‌ద్ధ‌తిలో ఆల‌య అధికారులు ఎంపిక చేశారు. శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి చెందిన 40 మంది పూజారులు ప్ర‌ధాన పూజారికి పోటీ ప‌డ్డారు. లాట‌రీ ద్వారా ప్ర‌ధాన పూజారిగా అరుణ్ కుమార్ నంబూద్రి ఎంపిక‌య్యారు. అలాగే శ‌బ‌రిమ‌ల అయ్యప్ప ఆలయానికి వంద మీటర్ల దూరంలో కొలువైన మాలికాపురం ఆలయప్రధాన పూజారిగా కొజికోడ్కు చెందిన వాసుదేవన్ నంబూద్రి నియమితులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement