Thursday, March 28, 2024

ఉగ్రం సాంగ్ రిలీజ్ చేసిన.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌

వినూత్న చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు హీరో అల్ల‌రి న‌రేష్‌..ఆయ‌న న‌టించిన తాజా చిత్రం ఉగ్రం.ఈ చిత్రానికి టూమ్‌ వెంకట్‌, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్‌ అందిస్తున్నారు. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది తెరకెక్కిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ సినిమాకు మరింత హైప్ తీసుకురావడం గ్యారంటీ అని వీడియో సాంగ్ చెప్పేస్తుంది. ఈ చిత్రం నుండి దేవేరి వీడియో సాంగ్ ని హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ లాంఛ్ చేశారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ఉగ్రం నుంచి దేవేరి సాంగ్‌ను లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది..అంటూ సాంగ్‌ను అందరితో పంచుకున్నాడు. దేవేరి గుండెల్లో చేరి.. మదిలో మోగిందే సరిగమ సావేరి అంటూ ఫీల్ గుడ్‌ ఇంప్రెస్‌తో సాగుతున్న ఈ పాట సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. శ్రీమణి రాసిన ఈ పాటను శ్రీచరణ్‌ పాకాల కంపోజ్ చేయగా.. అనురాగ్ కులకర్ణి పాడాడు. పోలీసాఫీసర్‌ అయిన నరేశ్‌ హీరోయిన్ మిర్ణాతో ప్రేమలో మునిగిపోతూ పాడుకునే ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నట్టు విజువల్స్ చెప్పేస్తున్నాయి. ఉగ్రంలో మలయాళ భామ మిర్ణా ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement