Friday, April 26, 2024

ఖేలో ఇండియాతో క్రీడల అభివృద్ధి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘ఖేలో ఇండియా’ పథకంలో భాగంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ప్రతి ఏటా నిర్వహిస్తూ ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో క్రీడలు, వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరిస్తున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖేలో ఇండియా క్రీడా పోటీలు నిర్వహించడం క్రీడల అభివృద్ధిలో మైలురాయి అన్నారు.

క్రీడా పోటీలు ద్వారా క్రీడల సంస్కృతి బలపడటంతో పాటు ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. క్రీడలు, వాటి అభివృద్ధి, వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ, మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కేంద్రం క్రీడలకు సంబంధించి కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement