తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, అధికారుల బృందం అమెరికా, జపాన్ పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటన ఈ నెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు కొనసాగనుంది. కాగా, మైనింగ్, గ్రీన్ పవర్ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ ఎక్స్‌పోతో పాటు ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాలను డిప్యూటీ సీఎం సందర్శించి పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు.
డిప్యూటీ సీఎం పర్యటన ఇలా…!
- ఈ నెల 24, 25 తేదీల్లో అమెరికాలోని లాస్ వెగాస్ లో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ మైనింగ్ ఎక్స్ పోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని.. వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో చర్చలు జరుపనున్నారు. ఆ తరువాత తదుపరి హోవర్ డ్యామ్‌ను సందర్శిస్తారు.
- 26న లాస్ ఏంజెల్స్ చేరుకుంటారు.
- 27న ఎడ్వర్డ్స్ & శాన్‌బోర్న్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థను పరిశీలిస్తారు.
- 28న పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులతో సమావేశం అవుతారు.
- 29న జపాన్ దేశంలోని టోక్యోకి చేరుకుంటారు.
- 30న స్థానిక దౌత్యవేత్త ఏర్పాటు చేసిన విందులో పాల్గొని… అనంతరం పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు.
- అక్టోబర్ 1న పెట్టుబడిదారులతో వ్యక్తిగత సమావేశం నిర్వహించి, అనంతరం యమాన్షి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను సందర్శిస్తారు.
- అక్టోబరు 2న తోషిబా, కవాసకి ప్రధాన కార్యాలయాలను సందర్శించి ఒసాకా చేరుకుంటారు.
- అక్టోబర్ 3న పానాసోనిక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, అక్టోబర్ 4న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.