Wednesday, April 24, 2024

నల్ల బియ్యానికి పెరుగుతున్న డిమాండ్.. కిలో రూ.200

తెల్ల బియ్యం చూసి ఉంటారు. దాంతో చేసే అన్నం తిని ఉంటారు. కానీ ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నల్ల బియ్యం తెరపైకి వచ్చాయి. నల్ల బియ్యం అన్నాన్ని తినేందుకు కొందరు మొగ్గు చూపుతున్నారు. దీంతో నల్లవరి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఏపీలోని పలు జిల్లాల్లోని రైతాంగం నల్లవరి సాగు చేస్తూ అధిక అదాయాన్ని పొందుతున్నారు. ప్రకృతి సేద్య విధానాన్ని అవలంభిస్తూ తక్కువ ఖర్చుతో ఈ నల్లవరి సాగు చేయవచ్చు. దిగుబడి తక్కువగా ఉన్నా మార్కెట్లో నల్ల బియ్యానికి మంచి ధర పలుకుతుండటంతో రైతులు నల్లవరి సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మన దేశంలో మణిపూర్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో నల్ల వరిని అధికంగా సాగు చేస్తున్నారు. బ్లాక్ రైస్‌ను పోషకాల గనిగా భావిస్తూ చాలా మంది ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్‌లు పుష్కలంగా లభిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులతో పాటు, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ నల్ల బియ్యం సంజీవనిలా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. సాధారణ తెల్ల బియ్యంతో పోలిస్తే ఇందులో ఐరన్, ప్రొటీన్, ఫైబర్, కాపర్, కెరోటిన్ వంటి పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. డయాబెటీస్ ను అదుపులో ఉంచటం, అధిక రక్తపోటు సమస్య, నరాల బలహీనత తదిర వ్యాధుల నుండి కాపాడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. నల్ల బియ్యం పంట కాలం 120 రోజుల నుండి 140 రోజుల వరకు ఉంటుంది. చీడపీడల బెడద లేకపోవటం సాధారణ ఎరువుల వినియోగించటం ద్వారా ఈ పంటను సాగు చేయవచ్చు. సాధారణ రకం తెల్ల వరి సాగులో ఎకరానికి 30 బస్తాల దిగుబడి వస్తే, నల్ల వరి సాగులో ఎకరానికి సుమారు 15 బస్తాలు మత్రమే ఉంటుంది. మార్కెట్లో కేజీ నల్ల బియ్యం ధర రూ.200 నుంచి రూ.300 వరకు పలుకుతుంది.

ఇది కూడా చదవండి: ఈ విషయంలో లేడీస్ ఫస్ట్ కాదండోయ్

Advertisement

తాజా వార్తలు

Advertisement