Thursday, April 25, 2024

డెలివరీ ఐపీఓ ప్రారంభం.. బిడ్డింగ్‌కు ఛాన్స్‌

న్యూఢిల్లి : డెలివరీ లిమిటెడ్‌ ఐపీఓ దరఖాస్తు ప్రక్రియ రేప‌టి నుంచి (బుధవారం) ప్రారంభం కానుంది. 13వ తేదీతో ఐపీఓ దరఖాస్తు ముగుస్తుంది. ఒక్కో షేర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ను రూ.462 నుంచి రూ.487గా నిర్ణయించారు. ఫేస్‌ వ్యాల్యూ ఒక్కో షేర్‌పై రూ.1గా ఉంటుందని డెలివరీ లిమిటెడ్‌ ప్రకటించింది. ఒక లాట్‌లో 30 షేర్లు కలిగి ఉంటాయని వివరించింది. అర్హత కలిగిన ఉద్యోగుల కోసం ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ.25 డిస్కౌంట్‌ కూడా ఉంటుందని తెలిపింది. ఐపీఓ ద్వారా రూ.5,235 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తున్నది. అప్పర్‌ లిమిటెడ్‌ ప్రైస్‌బ్యాండ్‌తో కంపెనీ వ్యాల్యూ రూ.35,284 కోట్లకు చేరుతుంది. మే 24న మార్కెట్‌లో లిస్టింగ్‌కు రానుంది.

ముందుగా రూ.7460 కోట్లను ఐపీఓ ద్వారా సమీకరించాలని కంపెనీ భావించింది. కానీ మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత కారణంగా దాన్ని రూ.5,235కోట్లకు తగ్గించుకుంది. రూ.21వేల కోట్లతో ఎల్‌ఐసీ ఐపీఓ కూడా వస్తున్న నేపథ్యంలో.. నిధుల సమీకరణ వ్యాల్యూను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ లిమిటెడ్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీఆఫ్‌ఏ సెక్యూరిటీస్‌ ఇండియా లిమిటెడ్‌, సిటిగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లు.. లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement