Saturday, November 26, 2022

ఢిల్లీ మర్డర్​ కేసు.. మోహైలీ చెరువులో శ్రద్ధా తల..

దేశ రాజధానిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్‌ శరీర భాగాలను కనుగొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే ఆమె తలను ఢిల్లికి సమీపంలోని మెహౌలీ వద్ద చెరువులో పడేసినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఆ చెరువులో ఉన్న నీటిని తోడేస్తున్నారు. అక్టోబర్‌ 18వ తేదీన ఆఫ్తాబ్‌ ఓ బ్యాగ్‌తో వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. గర్ల్‌ఫ్రెండ్‌ శ్రద్ధా శరీర భాగాలను పడేసేందుకు అతను ఆ బ్యాగ్‌ను వాడినట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్‌ వేసుకుని మూడుసార్లు రౌండ్లు కొట్టినట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -
   

సీసీటీవీ ఫూటేజ్‌ ఆధారంగా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. శ్రద్ధా మర్డర్‌ కేసులో కీలక ఆధారాల కోసం మెహౌలీ అడవిలో వరుసగా ఆరో రోజు పోలీసులు వెతికారు. మర్డర్‌ జరిగిన రోజున తాను డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆఫ్తాబ్‌ పోలీసులకు తెలిపాడు. నిందితుడు మారిజోనా తీసుకునేవాడని విచారణలో తెలిసింది. ఈ కేసులో విచారణ కోసం మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు పోలీసులు వెళ్లారు. స్నేహితులు, ఆఫీసు సహోద్యోగులతో శ్రద్ధా చేసిన వాట్సాప్‌ చాటింగ్‌కు చెందిన స్క్రిన్‌షాట్లు బయటకు వచ్చాయి.

అయితే శ్రద్ధాను ఆఫ్తాబ్‌ చాలా హింసించినట్లు ఆ చాటింగ్‌ ద్వారా తెలుస్తోంది. శ్రద్ధా ముఖానికి, మెడకు గాయాలైన ఫొటో కూడా ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదిలావుండగా, మెహౌలీ అడవుల్లో పోలీసులు కొన్ని మానవ అవశేషాలను కనుగొన్నారు. పుర్రె, దవడ, ఎముకలు సేకరించారు. వీటిని శ్రద్ధ తండ్రి డీఎన్‌తో సరిపోలడానికి ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపనున్నారు. చత్తర్‌పూర్‌ ప్లాట్‌ నుండి శ్రద్ధ బ్యాగ్‌ను, బట్టలు, బూట్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement