Thursday, April 18, 2024

అల్లోపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. రాందేవ్‌బాబాకు హైకోర్టు నోటీసులు

అల్లోప‌తి వైద్యంతో పాటు అల్లోప‌తి డాక్ట‌ర్ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన యోగా గురు రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు శుక్ర‌వారం నోటీసులు జారీ చేసింది. ఆగ‌స్టు 10లోగా నోటీసుల‌కు బ‌దులివ్వాల‌ని ఆయ‌న‌ను హైకోర్టు ఆదేశించింది. లాభాలు దండుకోవాల‌నే ఉద్దేశంతో రాందేవ్ బాబా ఆధునిక వైద్యంపై దుష్ప్ర‌చారం చేశార‌ని ఆరోపిస్తూ ఏడుగురు వైద్యులు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై కోర్టు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది.

క‌రోనా వైర‌స్ చికిత్స‌లో ఉప‌యోగించే కొన్ని ఔష‌దాల‌ను ప్ర‌శ్నిస్తూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో కూడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో రాందేవ్ బాబాపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అల్లోప‌తి మెడిసిన్ వాడిన ల‌క్ష‌లాది మంది క‌రోనా రోగులు మృత్యువాత ప‌డ్డార‌ని రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి.

ఈ వార్త కూడా చదవండి: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement