Sunday, March 24, 2024

ఆంక్షల సడలింపు దిశగా ఢిల్లీ సర్కారు : కేజ్రీవాల్..

దేశ రాజధాని ఢిల్లీలో ఆంక్షలు సడలించే దిశగా కేజ్రీవాల్ సర్కారు అడుగులు వేస్తోంది. రోజురోజుకూ కోవిడ్-19 కొత్త కేసుల సంఖ్యతో పాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పడుతుండడంతో ప్రస్తుతం అమలవుతున్న వారాంతపు కర్ఫ్యూ సహా పలు ఇతర ఆంక్షలను సడలించే యోచనలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఆయన వెల్లడించారు. కోవిడ్-19 కారణంగా ఢిల్లీవాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా జీవనోపాధి దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవనోపాధి దెబ్బతినకూడదన్నదే తమ ఉద్దేశమని, అదే సమయంలో ప్రజల ఆరోగ్యం కూడా తమకు చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు.

నిజానికి గత వారమే వారాంతపు కర్ఫ్యూను సడలించాలని ఢిల్లీ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్ ఎదుట ప్రతిపాదన ఉంచగా, ఆయన దాన్ని తిరస్కరించారు. కాకపోతే ప్రైవేటు కార్యాలయాలను 50 శాతం సామర్థ్యంతో పనిచేసేలా పంపించిన ప్రతిపాదనను మాత్రం అంగీకరించారు. ఢిల్లీ వ్యాపారులు తనను కలిసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పారని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో అమలవుతున్న ఆడ్-ఈవెన్ విధానం, వీకెండ్ కర్ఫ్యూ కారణంగా వ్యాపారాలు నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ నేపథ్యంలో తాము లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపించగా, ఆయన సుముఖంగా లేరని తెలిపారు. త్వరలోనే ఈ ఆంక్షలు తొలగిపోతాయన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement