Friday, April 19, 2024

దృడంగా ఉండటం తెలుసు..

ఇటీవల సినిమాలపై విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ సినిమాలు పలురకాల వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొందరూ ఏకంగా బాయ్‌కాట్‌ అంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. కావాలని చేస్తున్న విమర్శలు కొంత ఇబ్బంటి పెట్టిన అవి సినిమా ఫిలంతపై ఎలాంటి ప్రభావం చూపవని తాజా సూపర్‌హిట్‌ చిత్రం పఠాన్‌ నిరూపించింది. ఈ సినిమా వెయ్యి కోట్ల మైలురాయిని దాటేసింది. షారుఖ్‌ఖాన్‌, దీపికా పడుకునె ఈ చిత్రంలో నటించారు.


విమర్శలు, వివాదాలపై దీపికా స్పందించారు. ”మాదీ క్రీడాకారుల కుటుంబం. (దీపికా తండ్రి ప్రకాష్‌ పదుకునె బాట్మంటన్‌ క్రీడాకారుడు) కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అనేక క్రీడల్లో భఆగస్వామి అయ్యాను. ఆటలంటే ఎలా ఉంటాయనేది అందరికీ తెలుసు. ఒక్కోసారి సంక్షోభ సమయంలో ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలనేది ఇవి నేర్పిస్తాయి. ఈ కారణంగానే ‘పఠాన్‌’ చిత్రానికి వచ్చిన వివాదాలు నా మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. ” అని దీపికా పదుకునె చెప్పింది. పఠాన్‌ సక్సెస్‌ సందర్భంగా ఆమ8 ఓ పత్రికలు ఇచ్చిన ఇంటర్యూలో పలు విషయాలు తెలిపింది. ఆమె నాయికగా నటించిన పఠాన్‌ సినిమా విడుదలకు ముందుకు పలు వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా సినిమాలోని ”భేషరమ్‌ రంగ్‌…. ” పాటలో దీపికా పదుకొణ బికినీ ధరించింది. దీని రంగుపై విమర్శలు వచ్చాయి.
”నేను కానీ, షారూఖ్‌ కానివ్వండి మేము మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం. ఎన్నో ఆశలతో సినీరంగంలో అడుగుపెట్టాం. ఈరంగంలో రాణించాలంటే ఎంత కష్టమనేది మా ప్రయాణంలో తెలిసివచ్చింది. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. అందుకే పఠాన్‌ పై విమర్శలు వచ్చినపుడు వేచిచూసే ధోరణితో ఉన్నాం. ఎందుకంటే సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. అందుకే వివాదాలకు వివరణ ఇవ్వలేదు” అని దీపికా స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement