Friday, April 19, 2024

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు…కొత్తగా 1707 కేసులు

తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంట‌ల్లో ల‌క్షా 24 వేల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1707 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా 16 మంది మృతి చెందారు. అలాగే మహమ్మారి నుంచి 2493 మంది తాజాగా కొలుకున్నారు.

తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం క‌రోనా బారిన పడిన వారి సంఖ్య 6 ల‌క్ష‌లు కి చేరుకున్నాయి. ఇక ఇప్ప‌టికే 5.74 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు 3456 మంది మృత్యువాత‌ప‌డ్డారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 22,759 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement