Friday, September 22, 2023

బైకును ఢీకొట్టిన డీసీఎం.. దంపతులు మృతి

మెద‌క్ : డీసీఎం, బైక్ ఢీకొని దంప‌తులు మృతి చెందిన ఘ‌ట‌న మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్ సమీపంలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. న‌ర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్‌పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి తరలించారు. మృతులను చిలిపిచేడ్‌ మండలం రహీంగూడకు చెందిన నునావత్‌ రవీందర్‌, నీలగా గుర్తించారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement