Friday, March 29, 2024

క‌లెక్ష‌న్స్ తో దూసుకుపోతున్న.. దాస్ కా ధ‌మ్కీ

దాస్ కా ధ‌మ్ కీ హీరో విశ్వ‌క్ సేన్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది ఈ చిత్రం. ఈ సినిమాకి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్‌లలో మాత్రం విశ్వక్‌ సంచలనం సృష్టించారు. అప్పటివరకు తనకున్న మార్కెట్‌కు రెండింతలు కలెక్షన్‌లు సాధించి విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తారు. కావలిసినంత యాక్షన్, నివేదా గ్లామర్‌ ప్రదర్శన మాస్‌ ఆడియోన్స్‌ను కట్టిపడేసింది. దాంతో తొలి రోజు నుంచే ఔరా అనిపించే కలెక్షన్‌లతో బాక్సాఫీస్‌ దగ్గర దూసుకపోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు రూ.16 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్‌లు సాధించి బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకుంది.డివైడ్‌ టాక్‌తో ఈ స్థాయిలో కలెక్షన్‌లు రావడం అంటే మాములు విషయం కాదు. నాలుగు నెలల కింద రిలీజ్‌ చేసిన ట్రైలర్‌తో ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది. ఇక మూడు నెలల కింద విడుదలైన ఆల్‌ మోస్ట్‌ పడిపోయానే పిల్లా పాట ప్రతీ చెవిలో మోగిపోయింది. ఇలా రిలీజ్‌కు ముందే సినిమాపై తిరగులేని బజ్‌ ఏర్పడింది. ఇక ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు తారక్‌ రావడంతో సినిమాపై బజ్‌ అమాంతం పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement