Wednesday, March 27, 2024

దుమ్ములేపిన‌ నాని.. అద‌ర‌గొట్టిన ద‌స‌రా ట్రైల‌ర్

ద‌స‌రా ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళం..క‌న్న‌డ‌..మ‌ల‌యాళం..హిందీలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో హీరోగా నాని..హీరోయిన్ గా కీర్తి సురేశ్ న‌టించారు. కాగా ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ ఓడెల రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది లక్నో వేదికగా ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఊరమాస్‌ లుక్‌లో సాగే ట్రైలర్‌ గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. హీరో నాని నెవర్‌ బిఫోర్‌ అనేలా ఈ ట్రైలర్‌ సాగడం విశేషం. ఆద్యంతం యాక్షన్‌ అంశాలతో ఈ ట్రైలర్‌ సాగుతుంది. ఈ ట్రైలర్ చిత్తు చిత్తులా గుమ్మ అంటూ తెలంగాణ జానపద పాటతో ప్రారంభం కావడం విశేషం. మరోవైపు హీరోయిన్ కీర్తి సురేష్‌ లుక్‌ సైతం ఆకట్టుకుంటుంది. ఆమె ఎప్పుడూ కనిపించని లుక్‌ లో డీ గ్లామర్‌గా కనిపిస్తుంది. రెండు వర్గాల మధ్య గొడవ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తుంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా సంతోష్ నారాయణన్ దీనికి మ్యూజిక్ అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అన్ని కూడా ఆడియన్స్ ని అలరించి మూవీ పై అంచనాలు మరింతగా పెంచాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత పెంచింది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో బజ్‌ లేదు. ఇప్పుడీ ట్రైలర్‌ ఆ బజ్‌ తీసుకొస్తుందని చెప్పొచ్చు. ఈ నెల 30న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement